హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు

తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు.ఎల్బీ స్టేడియంలో పాల్కురికి ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై తెలుగు మహాసభలను ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. విశిష్ట అతిథులుగా తెలంగాణ గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రపంచ తెలుగు మహాసభలకు అధ్యక్షత వహించనున్నారు. ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంతో పాటు ప్రధాన వేదికలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఆదిలాబాద్ నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన డా.రాధా రాజారెడ్డి మన తెలంగాణ నృత్యరూపకం ప్రారంభసభలకు హైలైట్‌గా నిలువనున్నది. అనంతరం రామాచారి బృందం పాటలకచేరి ఉంటుంది.

జయ జయోస్తు సంగీత నృత్యరూపకాన్ని కళాకృష్ణ బృందం ప్రదర్శించనుంది. సాయంత్రం ఆరు గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన సాంస్కృతిక సమావేశం నిర్వహిస్తారు. దీనికి ముఖ్యఅతిథిగా నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, గౌరవ అతిథిగా చెన్నైకి చెందిన ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ హాజరవుతారు. ప్రధానవేదికైన ఎల్బీస్టేడియంలో కాకతీయుల కాలం నుంచి ప్రాచీన శిల్ప కళాకృతులు.. తెలంగాణ ప్రాంతంలోనే అనేక ఆలయాల నమూనాలను ఏర్పాటుచేశారు. తెలంగాణ పల్లెసీమలను తలపించే విధంగా స్టాళ్లను నెలకొల్పారు. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడానికి కారణమైన జినవల్లభుని కురిక్యాల శాసనం నమూనాను మహా సభల వేదిక సమీపంలో ఏర్పాటు చేశారు. శాసనంలోని కందపద్యాలను తప్పనిసరిగా వేదిక సమీపంలో ప్రదర్శించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ శాసనాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. శాతవాహనుల కోటిలింగాలలో లభించిన నాణేలతోపాటు, ఫణిగిరి నాణేలు, అసఫ్‌జాహీల కాలంనాటి నాణేలను ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ వార్తాపత్రిక

ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభలు కు అద్భుతమైన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎల్‌బి స్టేడియం ప్రధాన వేదికగా జరిగే ఈ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ప్రవేశద్వారం మొదలు, ప్రధాన వేదిక వరకు ప్రతి అలంకరణ తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా రూపొందించారు. ప్రతి సంగమేశ్వర ఆలయం మొదలు, బాసర వరకు అన్ని ప్రాంతాల చారిత్రాక విశిష్టత వివిధ అలంకరణలలో ప్రతిబింబించేటట్లు ఏర్పాటుచేశారు. సాయం సమయంలో ఎల్‌బి స్టేడియంలో మహాసభల గొప్పతనాన్ని సభికులకు తెలిసేలా రంగు, రంగుల లేజర్ లైట్ షో ఆకట్టుకుంటోంది. ప్రధాన వేదిక లోపల ఆసీనులయ్యే వారందరికీ తెలంగాణ సాహితీమూర్తుల గొప్పతనం తెలిపేలా వారి చిత్రపటాలు, వారి రచించిన పద్యాలు కుడి ఎడమ వైపు ప్రదర్శనకు ఉంచారు. మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులందరికి ఘనంగా స్వాగతం పలికే తీరులో సంప్రదాయ ఆహ్వాన నమస్కారం ఆకృతి, దాశరథి రంగచార్య నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఆకట్టుకునే తీరులో సిద్ధ మైంది.

ప్రధాన వేదికను ప్రత్యేకతలను గమనిస్తే.. సుమారు 170 అడుగులు వెడల్పుతో వెయ్యి స్తంభాలపై వేదిక ఉంది. కాకతీయ కళాతోరణంతో పైన తంగేడు పూల మధ్యలో నమస్కారంతో సభికులకు ప్రధాన వేదిక ఆహ్వానం పలుకుతోంది. ద్వారకపాలకులుగా పాల పిట్టలు ఎడమ వైపు, అటు తరువాత సంగమేశ్వర దేవాలయంపైన 7వ శతాబ్దానికి చెందిన అలంపూర్ నాగబంధం ఉంది. 56 తెలుగు అక్షరాల వర్ణమాల.. చీకట్లో వెలుగులు పంచే నక్షత్రాలు రూపంలో దర్శనమిస్తున్నాయి. ప్రధాన వేదిక కాకతీయ తోరణం కుడి, ఎడమలలో నాగిని నధనిక.. నాగిని మధనిక కుడివైపు శిల్పాలున్నాయి. తెలంగాణ సంస్కృతికి చిహ్నాంగా బతుకమ్మలు, జింకలు, సుమారు 20 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. మొత్తం 51 మంది తెలంగాణ మహనీయుల చిత్రపటాలు అలంకరించడం వల్ల చూపరులకు ఆనందం కలిగిస్తున్నారు.

Author: Elyuxen

Elyuxen, a student newspaper where students get to work as well as publish all the news related to colleges in and around Hyderabad. It is the first ever student newspaper in South India which is successfully running. The beauty and the tagline of this newspaper is it is *For the student, by the student, of the student

Leave a Reply